Posts

Showing posts from February, 2010

భాషాభిమానం

ఈ మధ్య టెక్సాస్ లో ఒక తెలుగు వాళ్ళ పార్టికి వెళ్ళాము. ఒక ఆవిడ ఒళ్లో ఒక బొచ్చు కుక్కని పడుకో పెట్టుకొని దానికి తెలుగులో జోల పాట పాడు తోంది . అమెరికా లో తెలుగు భాష మీద అభిమానం ఎక్కువయ్యింది, ప్రతి తల్లి, తమ పిల్లలను విధిగా ఆదివారం తెలుగు క్లాసులకి తోస్తున్నారు అన్నది విన్నాను. కాని ఇలా బొచ్చుకుక్కలకు కుడా తెలుగు బాష తప్పనిసరి, అని ఇక్కడ ఎ టెక్షస్ 'బాల థాకరే ' అన్నా అన్నారా అని , నా అనుమానాన్ని ప్రక్కనే ఉన్న మా తోడికోడలుని అడిగాను. అ అదేమీ లేదు, ఆవిడ ముగ్గురు పిల్లలకు అమెరికా టీవీ, ఫ్రెండ్ స్ రాహు కేతువులాగా వదలకుండా ఇంగ్లీషు తప్ప తెలుగులో మాట్లాడే అవకాసం ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళంతా కాలేజీలకు వెళ్లి పోయారు, ఇక చేయిదాతిపోయిన పిల్లలగాతే ఈ కుక్కకు కూడా పట్టకుండా ఉండాలని చేసే విశ్వ ప్రయత్న భాగమే ఇది . ఇప్పుడు ఆ శునకము తెలుగులో జోల పాడి తే తప్ప పడుకోను అని మొరాయించే స్థాయికి వచ్చింది. ఆ నారి శిరోమణి ఎపార్టికి వెళ్ళినా లేక ఎవ్వరన్న వాళ్ళ ఇంటికి వచ్చినా ఇలా తమ కుక్క భాషాభిమానాన్ని ప్రదర్సిoచుకుం టూ మురిసిపోతుటుంది అట. అన్నా ! బాల థాకరే గారు కాని ఈ అభినవ తెలుగు నారి ఘనవిజం గ...