భాషాభిమానం

ఈ మధ్య టెక్సాస్ లో ఒక తెలుగు వాళ్ళ పార్టికి వెళ్ళాము. ఒక ఆవిడ ఒళ్లో ఒక బొచ్చు కుక్కని పడుకో పెట్టుకొని దానికి తెలుగులో జోల పాట పాడు తోంది . అమెరికా లో తెలుగు భాష మీద అభిమానం ఎక్కువయ్యింది, ప్రతి తల్లి, తమ పిల్లలను విధిగా ఆదివారం తెలుగు క్లాసులకి తోస్తున్నారు అన్నది విన్నాను. కాని ఇలా బొచ్చుకుక్కలకు కుడా తెలుగు బాష తప్పనిసరి, అని ఇక్కడ ఎ టెక్షస్ 'బాల థాకరే ' అన్నా అన్నారా అని , నా అనుమానాన్ని ప్రక్కనే ఉన్న మా తోడికోడలుని అడిగాను. అ అదేమీ లేదు, ఆవిడ ముగ్గురు పిల్లలకు అమెరికా టీవీ, ఫ్రెండ్స్ రాహు కేతువులాగా వదలకుండా ఇంగ్లీషు తప్ప తెలుగులో మాట్లాడే అవకాసం ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళంతా కాలేజీలకు వెళ్లి పోయారు, ఇక చేయిదాతిపోయిన పిల్లలగాతే ఈ కుక్కకు కూడా పట్టకుండా ఉండాలని చేసే విశ్వ ప్రయత్న భాగమే ఇది . ఇప్పుడు ఆ శునకము తెలుగులో జోల పాడి తే తప్ప పడుకోను అని మొరాయించే స్థాయికి వచ్చింది. ఆ నారి శిరోమణి ఎపార్టికి వెళ్ళినా లేక ఎవ్వరన్న వాళ్ళ ఇంటికి వచ్చినా ఇలా తమ కుక్క భాషాభిమానాన్ని ప్రదర్సిoచుకుంటూ మురిసిపోతుటుంది అట. అన్నా ! బాల థాకరే గారు కాని ఈ అభినవ తెలుగు నారి ఘనవిజం గురించి విన్నారంటే ముంబాయి లో కుక్కలన్నీటికి కుడా బాలీవుడ్ సంగీతం మాన్పించి తమ యజమానులు మరాఠి జోల పాటలు, సంగీతము నేర్పాలనేకాక ఆక్కడ కుక్కలు మారాథిలోనే మొరగాలనికూడా ఒక జీఓ తెస్తారేమో అని నాకు ఒక్క క్షణము ముంబాయి లో కుక్కల మీద జాలి వే సింది.
అయితే నాకు ఇంతకుముందే భాషాభిమానం మీద అయిన మరోఅనుభావం గురించి ఈ సందర్భంగా మీకు ప్రసతవిస్తా. కంచిలో ఉన్న ఆలయాలన్నీ చూడాలన్న నా చిరకాలపు కోరిక మేరకు ఇంతకుమునుపే మా వారు నన్ను కంచికి తీసుకువెళ్ళి రోజంతా ఓపికగా తిప్పారు. వైష్ణవాలయాలకు పోటిగా అక్కడ శివాలయాలను చూసి చివరకు చీకటి పడే వేళకు మేము ఒక ఆలయానికి వచ్చాము, గర్భ గుడి చీకటిగా ఉండడంతో మూలా విరాట్ విగ్రహము శివుడా, విష్ణుముర్తా అన్నది నాకు అర్థము కాలేదు. సరే అక్కడే ఉన్న ఒక పూజారిని వచ్చి రానితమిళంలో ను , ఇక్కడ వీళ్ళకు ఇంగ్లీషు భాష తమిళంతో పాటు గా వెన్నతో పెట్టిన విద్య అని ఎవరో చెప్పిన గుర్తు, అందుకని ఒకసారి ఇంగ్లీషులో కుడా అడిగి చూసాము. అం దు కు ఆ పూజారి ఎవరో అంట రాని వారు వచ్చినట్లు గట్టిగా ఛి త్కారము చేసాడు. నాకు కన్యాశుల్కము నాటకములో ని అగ్నిహోత్రావధానులు జ్ఞాపకము వచ్చాడు "భోజనాల దగ్గర కూడా ఈ మ్లేచ్చ్కా భాష అవసరమా " అన్న వాదన నే మరిపిం చా డు ఈ పూజారి.
అప్పుడు అనుకున్నాను మన మాజీ ప్రధాని P.V. నరసింహారావుగారిలా చక్కగా అన్ని భాషాలు నేర్చుకొని ఉంటే ఈ రోజు ఈ అవమానము తప్పేది కదా అని.
వెంటనే సూత్రధరులు సినిమాలో శ్రీ లక్ష్మి లాగా నలభై రోజులలో తమిళం అన్న పుస్తకం కొనుక్కొని , అ పూజారి తో అనర్గళంగా తమిళంలో మాట్లాడేయ్యాలన్తమం త ఉక్రోషం వచ్చింది.
అసలు బాల థాకరే గారు టాక్సీ డ్రైవర్లకు 40 రోజులలో మరాఠి నేర్చుకోవాలి అన్న అంక్ష విధించారు గాని, అసలు భాషా సమస్య నా లాంటి యాత్రికులకు కదా ,ముంబాయి దర్శిం చాలన్న ప్రతి ప్రయాణి కుడు కుడా మరాఠి నేర్చుకోవాలి అని రుఉలు పెడితే నా లాగా భాష రాని కారణంగా అవమానం పాలు కానక్కరలేదు.
ఆకలికి ము ష్టి ఎత్తు కు నే ఒక బిచ్చగాడు స్వభాష లో ముష్టి అడగడము నామోషి గా తలచి "madam కాన్ యు please గివె సం డే ఓల్డ్ రైస్ ఫ్రొం ది పోట్" అని అడిగాడని పానుగంటి గారు తమ 'స్వభాష " అన్న వ్యాసములో స్వభాష పట్ల చిన్న చూపుని చాల చమ త్కారము గా ఎత్తి చూ పిం చారు.
ఇలాంటి భాష భేదాలు లేకుండా చేయాలని , ప్రాంతీయ భాషలతో పాటు దేశం లోని ప్రజలందరూ ఒకరితో నొకరు సం భాషించుత కు వీలుగా , హింది భాషను రాష్ట్ర భాషా గా గుర్తింపు తీసుకొనిరావడానికి ౧౯౮౦ లో కేంద్ర ప్ర'భుత్వము విద్యా రంగంలో కొన్ని మౌలికమైన మార్పులు ప్రవేశ పెట్టింది. ఒకటి హింది ఒక కఅమ్పల్సారి సబ్జెక్టు గా హై స్కూలు వరకు నిర్దేసించింది. అంతే కాకుండా హింది ప్రచార సభ తరఫున సాస్కృతిక , వ్యాస రచన పోటీలు నిర్వహించి బహుమతులను కుడా అందచేసారు.
స్వ భాష అంతరించి పోతున్నదన్న వ్యదే బాల థాకరే గారిని పిడిస్తుం టే , ఇలాంటి భాషా పునరుద్ధరణ కార్యక్రమాలు అమలు పరచాలి కాని ౪౦ రోజులలో మరాఠి అంటే మన 'శ్రీలక్ష్మి' గారినే అనుకరిస్తారు అందరు

Popular posts from this blog

Cooking and Pretend Play with Cousins

గోపాలసామి