హిందూత్వము
VirinchiPriya
మత సామరస్యము, మత సహనము రెండూ మన భారతీయులలో ఎలా జీర్ణించుకొని పోయాయో వెనుకటి మన పల్లెలలో వారు నడిపిన, జీవన విధానాన్ని చూస్తే అర్ధం అవుతుంది. అది వారు ప్రత్యేకంగా పనికట్టుకొని ఇలా ఉండాలి అని అలవర్చుకున్నది కాదు. అది అనాదిగా భారతీయులలొ ప్రకృతి సిధ్ధంగా అలవడినది తప్ప మరొకటి కాదు. ఆ సహజీవనమే వారి నిజ జీవనవిధానము. ఆర్యుల నుంచి ఇటీవల కాలంలో వచ్చిన పాశ్చాత్యుల వరకు ఎంత మంది దండయాత్రలు సాగించినా,
తమదైన పంథాలో తమ స్వంత ప్రవౄత్తిని కాపాడుకుంటూ అన్నిటినీ తమలో మమైకంచేసుకున్నారే తప్ప వేటిని వదిలేయలేదు.మనము ఈ సహనాన్ని, సామరస్యాన్ని రెండిటినీ కలిపి భారతీయతత్వము లేదా హిందూత్వము అని చెప్పుకోవచ్చును.
హిందూత్వము యొక్క మౌలిక ప్రకౄతిలోనే మత సహనము ఇమిడియున్నది అనడానికి హిందూమతములో పుట్టి, ముకిత్ సాధనకు మతములు అడ్డు రావని నిరూపించిన ఒక ఇల్లాలే నా ఈ వ్యాసమునకు ప్రేరణ . అది కృష్ణా జిల్లాలో కంభంపాడు అన్న చిన్న గ్రామము. ఆవిడ ఎవరోకాదు మా తాతమ్మగారయిన భండారు రుక్కిణమ్మగారు. సనాతన సత్సంపన్న బ్రాహంఅణ వంశములో పుట్టి , అంతకు తగిన సదాచార్ బ్రాహంఅణ వంశమగు భండారు వారిల్లు మెట్టికూడా ఆమె తన పినతల్లి కుమారుడగు పెద్దపల్లి రాజాగారు నమాజు చేయుట చూచి, ఆ ప్రశాంత జప తపమునకు మురిసిపోయి అతని దగ్గర ఉపదేశము పొందినది.
ఆనాటి నుంచి విధి తప్పకుండా తన 108వ ఏడు, ఆవిడ చనిపోయే వరకు రోజుకు అయిదు సార్లు నమాజు చేసేది. మా అందరికీ ఆశ్చర్యకరమైన ఎప్పటికీ మరచిపోలేని దృశ్యము ఆవిడ చేసే ఈ నమాజు ప్రక్రియ. ఇది ఇక్కడ తప్పక వర్ణించవలసినదే!
ఆ ఊరికి కరణం గారైన వెకటేశ్వర్ రావు గారిల్లు. బయట వసారాలో నుల క మంచము, ఆ మంచము మీద తెల్లటి పక్క. దాని మీద బోసి నోటితో, బోడిగుండుతలతో , నడుము పూర్తిగా వంగిపోయి, తెల్లని గ్లాస్కో చీరతో రవికెలేని ముడతలు పడిన తన శరీరాన్ని పూర్తిగా కప్పుకొని కాళ్ళు వెనక్కి ముడుచుకొని కూర్చొని ఉన్న నూరేళ్ళు నిండిన ఒక పండు ముదుసలే మా తాతమ్మ గారైన రుక్కిణమ్మ గారు. ఆ ఇంట్లో కోడళ్ళ్లు, మనుమరాళ్ళు మడి కట్టుకొని పూజలు పునస్కారలు చేస్తుంటే ఈవిడ తనకంటే మూడింతలూన్న ఒక కఋఋఅ పట్టుకొని, వంగిపోయిన నడుముతో, మసకగా ఉన్న కంటిచూపుతో, మోకాళ్ళెత్తున్న గడపలు దాటుతూ పెరట్లో ఉన్న బావిదగ్గరకెళ్ళి తనంతట తాను నీళ్ళు తోడుకొని స్నానము చేసి, ఒక చిన్న చెంబుతో నీళ్ళు తెచ్చుకొని తన మంచంఉ మీద కూర్చుండేది.ఆవిడ మోకాళ్ళు వెనక్కి ముడుచుకొని వంగి ఏదో లోపల చదువుకుంటూ ముందుకు వంగుతూ లేస్తూఉండేది. ఆ కార్యక్రమము అయిన తరువాత చేతిలో ఉన్న జపమాలతో జపము చేసుకుండేది.
అలా మా తాతమ్మగారైన రుక్కిణమ్మగారు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలతో, 15 మంది మనుమలు మనుమరాండ్రలతో 50 మంది కి పైగా మునిమనుమలతో కష్టాలను సుఖాలను సమంగా పంచుకొని, 1980లో తన నిండు జీవితమును చాలించినారు. ఇలా ఆ ఇంటిలోపల సదాచార బ్రాహంఅణీకం ఇంటి వసారాలో అతి ప్రశాంతముగా, నియమబద్ధముగా మహమ్మదీయ మతాచరణమూ రెండునూ ముక్తిని సాచించుకోగలిగాయి. ఇందులో ఎవ్వరూ ఎవ్వరినీ వెలివేయలేదు. దీని కొరకు ఆ గ్రామములో ఏ వైరాలు లేవలేదు. ఎవ్వరు ఏ రకంగా పూజించినా అన్నీ ఆ భగవంతునికే చేరతాయి, అంతా ఆ ముక్తి కొరకే కదా ! అన్న గొప్ప భావంతో వచ్చిన నిర్లిప్తతే ఒక సహజ స్వభావంగా ఈనాటికి హిందూత్వము పయనము సాగిస్తోంది. ఒక మహానదిహిమాలయ పర్వతశ్రేణులలో ఒక చిన్న ధారగా పుట్టి ఎత్తు పల్లాలకు అనుగుణంగా తన ఉనికిని, తన ఆవేశాన్ని మార్చుకుంటూ చిన్న చిన్న మిగతా ధారలన్నిటినీ కలుపుకొని అంతలోనే అనంత నురగలతో భయంకొలిపే జలపాతంలా మారి అడ్డు వచ్చిన చిన్న, చిన్న రాతి గుండ్రాళ్ళను పిండిచేస్తూ, పెద్ద పెద్ద వౄక్షాలను సైతం వ్రేళ్ళతో సహా పెకిలించి తనతో పాటుగా తీసుకొని ఎత్తైన శిఖరాల మీదనుంచి నేల మీదికి దూకి ప్రవహిస్తూంది. ఈ మహానది యొక్క గమ్యం సాగర సంగమం. అందుకు దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇతర చిన్న కాలువలు నదులు వచ్చినా అన్నిటినీ కలుపుకొని తన గమ్యం చేరటం తప్ప ఈ మహానదికి తరతరాలుగా ఇంకొక మార్గం తెలియదు.
ఇదే విధంగా భారతదేశ హిందూ మతసంస్కౄతి కూడా ఎన్నో వేల సంవత్సరాల పూర్వం, సనాతన వైదిక ధరంఅంగా ఎక్కడ ఎప్పుడు పుట్టిందో కూడా స్పష్టంగా చెప్పలేము. అది ఒక సంస్థగా పుట్టలేదు. దానికి ఎల్లలు ఇవి అని చెప్పగలిగినవారు లేరు. తనది అనంతరూపం, అనేక వైవిధ్య రూపాలాతో తన ఉనికిని చాటుకుంది. హిందూత్వము ఒక మతంగా పుట్టలేదు. పంచభూతాలను పూజిస్తూ మొదలయిన ఈ సనాతన ధరంఅం ఒక తత్వంగా వెలుగొందింది.
ఆ మహానది ఎలా దారిలో వచ్చిన వాటిని తనలోమమైకం చేసుకోకలిగిందో హిందూత్వము కూడా భారతదేశానికి వచ్చిన అనేక మతాలను, ధరంఆలను తనదైన బాణిలో తన స్వస్వరూపాన్ని వదిలిపెట్టకుండా, తన సహజరూపానికి మెరుగులు దిద్దుకుంది.
అసలు హిందూత్వము యొక్క స్వరూపము ఎలాంటిదో తెలుసుకుంటే, మత సహనము మతసామరస్యము ఎలా హిందూత్వములో ఇమిడియున్నాయో అర్ధంవుతుంది. హిందుత్వమున ఛాంధస తత్వమునకు తావులేదు. fundamentalism అనేది హిందూత్వము యొక్క మౌలిక ప్రకౄతి లోనే లేదు. హిందూత్వమునకు ఒక సంస్థ లేకపోవడం అనేది దాని మౌలిక స్వరూపం లో ఒక భాగం. ఎవరూ ఎవరి మీద మతం పేర అధికారం కాని నియమాలను కాని విధించలేదు. హిందూత్వము ఒక తత్వశాస్త్రము. ఇందులో ఆస్తిక నాస్తిక తత్వాలు మేళవించబడ్డాయి. హిందువులు మతం పేరిట కట్టుబడి యుండలేదు. పంచభుతాలను పూజిస్తు మొదలయిన హిందూత్వము తరువాత వచ్చిన దేవతావతారములను తమ మతములో ఆమోదించుట యనునచి చాలా కాకతాళీయముగా ఎవరి ప్రమేయము లేకుండా జరిగింది. ఈ నిర్విరామ అంతులేని అంతర్లీనత, ఇతర మతల పట్ల ఉన్న నిర్లిప్తతే భారతీయులకు మత సహనము అలవరడానికి తోడ్పడింది.
భారతదేశము అనాదిగా ఎన్నో మతములనుకు ఆశ్రయమివ్వడమే, ప్రస్తుత మతసహనమునకు పునాది. హిందూదేశ చరిత్ర చూసినట్లయితే క్రీస్తు పూర్వము 2వ శతాబ్ధములో పుట్టిన వేదాలనుంచి , 6వ శతాబ్ధములో పుట్టిన బౌధ్ధమతము, జైనమతము, 8వ శతాబ్ధములో వచ్చిన యూదులు, క్రీస్తు శకము 4వ శతాబ్ధములో వచ్చిన క్రైస్తవులు. 8వశతబ్ధములో వచ్చిన మహమ్మదీయులు మొన్నీమధ్య వచ్చిన బహాయి మతము , ఇవన్నీ కూడా తమ తమ సస్వరూప్యాన్ని కాపాడుకో కలిగాయి అంటే అది ఒక్క భారతదేశములోనే సాధ్యము.
ఆ మహానది ఎలా తన దారిలోనున్న వాటినన్నిటినీ తన వెంట తీసుకొని ఉర్రూతలూగుచూ సాగరసంగమానికి పయనిస్తుందో హిందూ మతం కూడా తన సనాతన ధర్మాచరణ తో తన చుట్టూ ఉన్న అనేక సంస్కౄతలను, సాంప్రదాయలను, తెగలను, జాతులనే కాక బయట దేశాలనుంచి విచ్చేశిన ఇతర మతాలను సైతం తనవిగా తనలో అంతర్లీనం చేసుకుంటూ మోక్ష సాధనే గమ్యంగా సాగిపోతూ ఉన్నది. హిందూత్వమును ఒక మతం అని పరిగణించడం వల్ల, దాని యొక్క అనంత స్వరూపాన్ని విశ్వమానవ తత్వాన్ని ఒక చట్రం లో బిగించటం అన్న విఫల ప్రయత్నం చేయడమే.
హిందూత్వము యొక్క చరిత్ర పరిశీలించినట్లయితే అనేక ముక్తి మార్గాలు గోచరమవుతాయి. ఆ పరమ పదము సాధించడానికి, ఆ బ్రహ్మజ్ఞానమును పొందడానికి పూర్వము అనేకమంది అనేక మార్గాలు అవలంబిచారని తెలుస్తుంది. భగవంతునిని కనుగొనడానికి , సత్య అన్ వేషణకు ఏ మార్గం అయినా తప్పు లేదు అనే భావనే మన భారత దేశ మత సహనానికి పునాది అని ఈ చరిత్ర వక్కాణించి చెప్తుంది.
హిందూత్వములో నున్న ఆలోచనాస్వేఛ్చ, మనుష్యులకు వారి వారి సమర్ధతను, వారి ఇష్టం ను పట్టి విభిన్న రీతులలఓ ఆ భగవంతునిని ఫూజించటానికి అవకాశం కల్పించింది.హిందూత్వము యొక్క అనంతమయమైన లక్షణాలలో ఇష్టదేవతా ప్రార్థన ఒక రూపం. యుగా ల నుంచి హిందూత్వములో అంతర్లీనమయిన వివిధ దేవతా స్వరూపాల నుంచి ఎవరి మనసుకు నచ్చిన , ఎవరికి అనుకూలమయిన దేవతాలను పూజించడం అనేది క్రమక్రమముగా ఆచారంగా మారింది. కులదైవాలు అనేది బహుశా ఇలాగనే మొదలు అయిఉండవచ్చును. ఈ ఆచరణ హిందూమత గ్రంథాలగు పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులలో ప్రస్తావించిన దేవతలతోనే ఆగలేదు. ఆ తరువాత వచ్చిన ఎంతొమంది యోగులను, మహాపురుషులను కూడా పూజించడం అనేది పరిపాటి అయిపోయినది. ఈ యొక్క ఇష్టదేవతా ప్రార్థన అనే సాంప్రదయము ఇతర మత దైవాలను, యోగులను, పూజించడాన్ని కూడా ఎవరూ ఖండించలేదు. ముక్తి సాధన కొరకు పాటు పడిన అందరినీ హిందూత్వము తనలో మమైకము చేసుకుంది.
అలాంటి ముక్తిమార్గాలలో, ఈ యొక్క ఇష్ట దైవాన్ని ఎన్నుకొనుటలో మహమ్మదీయ దైవమయిన 'అల్లా ' ని పూజిం ంచడం , మహమ్మదీయ దైవప్రార్థన అయిన 'నమాజూ చేయడం సహితం అలవాటు చేసుకున్న ఒక సద్ బ్రాహ్మణ ఇల్లాలి గురించి చెప్పడమే ఈ సుధీర్ఘ ఉపన్యాసము యొక్క ముఖ్యోద్దేశ్యము.
Comments