ఈ ప్రపంచానికి పేరేది

ఈ ప్రపంచానికి పేరేది
- విరించిప్రియ
ఈ రోజు ప్రొద్దున విజయ గారు phone చేశారు. " ఏమండోయ్ మీకో విషయం చెప్పనా ఈ అమెరికా జీవితం అంతా ఒక కల, ఎందుకంటే మనము వాస్తవానికి చాలా దూరంలో ఉంటున్నాము, India తిరిగి వెళితే అది అసలు Realty" అని అంటుంటే, నాకు ఆశ్చర్యమేసింది, ఎందుకంటే సరిగ్గా రెండు రోజులక్రితం నేను ఇదే మాట మా వారితో అలా అన్నాను. ఇది కొద్దిగా క్లిష్టమైన టాపిక్, ఎందుకంటే ఆ యొక్క భావాన్ని బాధని అర్ఢం చేసుకోవాలంటే మనము అందరము ఒక్క నిముషము మన ఈ fast forward , weekend to weekend ఎదురు చూసే జీవితన్ని pause నొక్కి మన చుట్టూ ఉన్నా పరిస్థితులకు మనము ఎల స్పందిస్తున్నము, అసలు ఆ పరిస్థితులు మన పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి అని చూసుకుంటే నేను, విజయా గారు చేసిన తీర్మానాన్ని మీరు ఆంగీకరిస్తారు.నేను back India లో ఎలా ఉండేదాన్ని ఇక్కడ ఎలా different గా ఉంటున్నానో చెప్పాలంటే మా చెల్లెలు indiaలో ఎలా ఉంటుందొ చూస్తే తెలుస్తుంది. నేను అమ్మా వాళ్ళకి phone చెయ్యటము మాట్లాడటము , ఏడాదికొకసారి India వెళ్లినప్పుడు చూసి రావటము మించి కూతురిగా నా బాధ్యతలు ఏమి లేవు అనుకుండేదాన్ని. ఇ నేను అలా అనడానికి అమ్మా వాళ్ళ పరిస్థితి India లో అంత బాగా లేదు కాబట్టి
... to be continued

Comments

Popular posts from this blog

Cooking and Pretend Play with Cousins

గోపాలసామి