రినైస్సాన్ యోగా క్లబ్


రినైస్సాన్ యోగా క్లబ్



మొదటి సీను

వాణి: నా మాట మన్నించి మీరందరఊ ఈవేళ ఇక్కడకు వచ్చినందుకు చాలా సంతోషము. ఇప్పుడు అసలు విషయానికి వద్దాము. నేను ఈవేళ మిమ్మల్ని పిలిచింది మనం అందరము కలిసి "రినైస్సా న్ స్ యోగా క్లబ్" ఒకటి పెట్టి మనమే రోజు ఒక టైములో కలిసి యోగా ప్రాక్టీసు చెయ్యొచ్చు అన్న ఉద్దేశ్యముతో, దినికి మీ అందరి అభిప్రాయము కూడా తెలుసుకుందామని.

ఈశ్వరి: ఓహ్! this is an excellent idea! నేను ఓహాయో లో ఉన్నప్పుడు యోగ క్లాసులకు వెళ్ళేదాన్ని. కావాలంటే I can guide you all .
జాహిదా: అసలు యోగ క్లబ్ పెట్టాలన్న అధ్భుతమైన ఆలోచన మీకెలా వచ్చిందండి వాణీ గారు ?
వాణి: మీరు చూస్తునే ఉన్నారు కదా మహిళా మండలులు మరీ 70'స్ ఫాషిఒన్ పాతవై పోయాయి, ఇక కిట్టీ పార్టీలు అవీ అంటే డబ్బుతో పని, బోలెడు శ్రమ. మనలో ఫిట్ నెస్సుకోసము ప్రతి ఒక్కరూ ఏదోక జిం లోనొ యోగాక్లాసు లోనో జాయినవుతున్నారు. సరే మనమే ఎందుకా పని చెయ్యకూడదని మిమంలని ఇక్కడ సమావెశ పరిచాను.

జ్యోత్స్న: అవునవను, యోగ అయితే ఖర్చులేదు, శ్రమ అంతకంటే కాదు, ముక్కుమూసుకొని మున్నూటరవై రోజులు భేషుగ్గా చేసుకోవచ్చును. ఏమంటారండి ప్రసూన గారు!

ప్రసూన: నాకయితే యోగ గురించి ఏమీ తెలీదు ! ఏదో కాస్త నలుగురు తెలుగు వాళ్ళము కలుస్తాము కాబట్టి కాలక్షేపము అవుతుంది కదా అనీ , ఈ విధంగా అయినా అమేరికాలో బోర్ కొట్టకుండా ఉంటుందని నా ఉద్దేశ్యము.

జాహిదా: అయ్యో ! యోగా ని అంత తేలికగా కాలక్షేపము అని తీసిపారెయ్యకండి. ఇదంతా మన భారతదేశము యొక్క సంపదండండిమన వాళ్ళే దీనిని నిర్లక్ష్యం చేస్తున్నారండి! అదే ఇక్కడ చూడంది, ప్రతి ఒక్క అమెరికనూ Yఓగ మీద ఒక బుక్ వ్రాసేస్తున్నాడు. అదే కాదు ప్రతి ఒక్క యోగ క్లాసు ఈ అమెరికన్ లు నడిపేదే, ఏ టీవి ప్రోగ్రాములో చూసినా అమెరికన్ యోగ టిచరే! నాకయితే తల కొట్టేసినట్లుంటుంది మనము వాళ్ళని చూసీ నేర్చుకోవాలంటే!

వాణి: అసలు ఒక యోగా ఏమిటండి మన సంస్కృతి మన food మన వేదాలు ఒకటి ఏమిటి అన్నీ కూడా మన వాళ్ళ కన్నా మిగతా దేశాల వాళ్ళు చాల శ్రద్దగా follow అవుతున్నారు.

జ్యోత్స్న: అవును that is so true ఒకప్పుడేమో తెల్లదొరల పాలన వలన మరి ఇప్పుడేమో ఇదిగో ఈ satellite TV వలన మన culture తుంగలో తొక్కేసి అటూ ఇటూ కాని ఈ western culture ని నెత్తిన పెట్టుకుంటూ భ్రష్టు పట్టి పోతున్నారు.

ఈశ్వరి: మొన్న week end దోసా గ్రిల్ కెళితే 40 నిముషాలు వెయిటింగ్ ఏమిటబ్బా ఇంత రష్ అని లోపలికి వెళ్ళి చూద్దును కదా సగానికి పైగా ఆమెరిక న్ స్ శుభ్రంగా ఇడ్లీ సాంబారు లాగించేస్తున్నారు.
జాహిదా: మరి మన పిల్లఏమిటండి పిజ్జాలు, బర్గర్లు, అని వేధిస్తారు. ఇలా మనమే మన culture వదిలిపెడితె , రేపు ఈ అమెరికన్ స్ దగ్గర నుంచి నేర్చుకోవలసి వస్తుందేమో.

వాణి: జాహిదా దానికి solution ఉంది. మనం మన పిల్లలకు చిన్నప్పటి నుంచి పాత చింతకాయ పచ్చడి, గోగూర పచ్చడి, తోటకూర పప్పు, అలవాటు చేశామనుకోండి, ఇక వాళ్ళు అరిచి గీ పెట్టినా తెనాలి రామలింగడి పిల్లిలా పిజ్జాలు, బర్గర్లు, ముట్టుకోమన్నా ముట్టుకోరు.

జాహిదా: అయితే మీ దగ్గర చాలా నేర్చుకోవాలి అండి, మేము కూడా ఈ రోజు నుంచి మా పిల్లలకు శుద్ధమైన భారతీయ food మాత్రమే పెడతాము.

జ్యోత్స్న, జాహిదా, ప్రసూన, ఈస్వరి: చాలా thanks అండీ వాణి గారు. మీరు initiative తీసుకొని ఇదంతా చేసినందుకు.
మనము అనుకున్నట్టుగా రేపు సాయంత్రము యోగా క్లాసుకి కలుద్దాము bye !

వాణి: bye see you all tomorrow


scene 2 వాణీ గారి ఇంట్లో :
లక్ష్మ ణ్ గారు ఆ రోజు work from home ఇంట్లోనే ఉన్నారు. కింద లివింగ్ రూములో కంప్యూట్ రు ముందు కూర్చొని ఉన్నారు.

వాణి: ఏమండి ఈ రోజు మా యోగ session ఉంది, మీకు disturbance సేకుండా మేము బేస్ మేంట్ లో పెట్టుకున్నాము. అంతలోనే మిగతా వారు కూడా వస్తారు. ఆందరూ తెల్లటి దుస్తులతొ కిందికి దిగి పోతుంటే లక్ష్మ ణ్ గారు అలా నోరు తెరుచు కొని వారు వెళ్ళిన వైపే చూస్తుండి పోయారు. బేస్ మేంట్ నుంచి వాళ్ళ మాటలు వినపడుతుణ్నాయి.

వాణి: మనము Yఒగాతో పాటు diet కూడా మారిస్టే చాలా బాగుంటుంది. ఉదాహరణకు ఆకు కూరలు, బేన్ sprouts ఎక్కువగా తింటే మంచిది.

జాహిదా: అసలు ఈ vegeterianism , యోగా మనభారతదేశానివి కాదండి ,మన వాళ్ళు patent చెయ్యకపోబట్టి ఈ అమరికన్ స్ మనవన్ని నేర్చుకొని మనకే నేర్పిస్తున్నారు.
ఈ లోపల ఈశ్వరి గారు బకాసనము వేసి మిగతా వాళ్ళకి కూడా ఎలా చెYయాలో చెప్తున్నారు.
జాహిదా: అబ్బ! ఆమె ఎంత బాగా చేస్తునారండి, మనము అంతసేపు ఉండలేస్తామా అలా, ..... అందరూ కూడా ఆసనాలు వెయ్యటానికి ప్ర్యత్నిస్తారు.

ముందుగా ప్రసూన కింద పడుతుంది. ఆ తరువాత జ్యోత్స్న , ఆ తరువాత జాహిదా వాణి వరసగా పడతారు.

వాణి: మీదెందుకండి మనమందరము ఇలానే ఒక సంవత్సరము చేశామంటే దీనిలో experts అయిపోవచ్చు.
ఇదంతా వింటూ లక్ష్మణ్ సోఫాలో పడుకొని నిద్రపోYఆరు.
ఆయన కలలో.......

ఆ అయిదుగురు తెల్లటి దుస్తులు ధరించి ,మెళ్ళో రుద్రాక్షమాలలతో చేతిలో జపమాలలతో యోగ ముద్రలో ఉన్నారు. ఉన్నట్టుండి అందరూ ఒక్కసారిగా లేచి నిలబడి కుడి చేయిని గాలిలోకి చాపి శపథం చేయటానికి అన్నట్టుగా సిధ్ధమయ్యారు. "మనము renaissance yaga group' మెలకువనైనా, కలనైనా, ఇంట్లోనైనా, బయటైనా అనుక్షణం యోగ గురించి చింత తప్ప వేరే ధ్యాస ఉండకూడదు. మనకు పతంజలి నుంచి అనాదిగా వస్తున్న అతి ప్రాచీనమైన, మరియు అతి పవిత్రమైన ఈ యొగాభ్యాసమును ఈ న్యూజెర్సీ అంతా ప్రచారము చేసి భారతదేశ సనాతన డర్మాని, ఖ్యాతిని ప్రపంచానికి తెలియచేద్దాం. అంత వరకు మనము నిద్రపోయేదిలేదు అని శపథం చేశారు.

ఈశ్వరి గారింట్లో: Mommy what is there to eat అని కాలేజి నుంచి వచ్చిన శ్రీజ వాళ్ళమ్మను అడుగుతుంది. ఈశ్వరి 'జీ టీవిలో యోగా వస్తుంటే చూస్తూ అనుకరిస్తోంది.
అక్కడ టేబుల్ మీద గిన్నెలో ఉన్న ఉడ్కబెట్టిన కూరలను చూసి what is this are we suppose to eat this? అని తల్లిని అడిగింది శ్రీజ.

దానికి ఈశ్వరి గారు That stuff is good It is full of vitamins and ptotein

శ్రీజ: okay Mom ! Iam going to work I will grab something there

ఆ సాయంత్రము

శేఖర్ : ఏమిటిది చికెన్ వండలేదా! చికెన్ ఏమిటండి? మీకు దానికన్నా రుచికరమైనది, పుష్టికరమైనది, శుద్ధమైనది వండాను--- తోటకూరపప్పు !

శేఖర్: ఏమిటే నీకేమయ్యింది? నిన్నటికి నిన్న 'iron' అంటూ గోంగూరపప్పు , మొన్న 'సాలాడ్' అంటూ పచ్చిగడ్డి. ఈ రోజు ఈ పప్పు

ఈశ్వరి: అయ్యో నాకేం కాలేదండి ! ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుచుకుంటున్నాయి. 'Yoga for Life', ' Yoga for Weight Loss' , 'Yoga for Peace', అంటు మన యోగాని వీళ్ళు ప్రచారం చేస్తున్నారో అలాగే ఈ తోటకూర, గోంగూరని కూడా ఈ అమెరికణ్ స్, ఇంకొద్ది రోజులలో గోంగూర బర్గర్, తోటకూర సాలాడ్ ములక్కాడ fries అని పాక్ చేసి అమ్మితే అప్పుడు మీరే లొట్టలేసుకుంటు మరీ తింటారు. అందుకే మా యోగా క్లబ్ లో వీటిని కూడా పేటెంట్ చేసే ఆలోచన నడుస్తోంది.

శేఖర్: తలకాయ పట్టుకొని, ఈశ్వరి ఇండియా ఏమన్న వెళ్లి వస్తావా కొన్నిరోజులు మీ అమ్మ దగ్గరికి అని దగ్గర కోర్చోపెట్టుకొని అడిగాడు.

ఈశ్వరి: అయ్యో నేను ఇండియ వెళితే మా శపఢం మా ట ఏమిటి మా ఈ యోగా గ్రూపు చూసుకోండి Made by Indians, Run by Indians గా అంతర్జాతీయంగా ఎంత గుర్తింపు తెచ్చుకుంటుందో అని మిగతా పప్పు కూడా వడ్డించి యోగా క్లాసు టైం అయ్యిందని డ్రెస్స్ చేంజ్ చేసుకోవటానికి వెళ్తుంది.

జ్యోత్స్న గారింట్లో
రాజశేఖర్ గారు మేడ మీద నుంచి దిగి కిందికి వస్తూ లివింగ్ రూములో జ్యోత్స్న సంగీత పాఠం నడుస్తూంటే తొంగి చూశాడు. students చేదు మందు మింగినట్లుగ మొఖాలు అదొ రకంగా పెట్టి జ్యోత్స్న చేస్తున్న భ్రమరీ ప్రాణాయామం చూస్తున్నారు. జ్యోత్స్న రెండు చెవులు, రెండు ముక్కులూ గట్టిగా మూసుకొని లోపలనుంచి గా లి పీలుస్తూ వదులుతూ ఒక విధమైన శబ్దం చేస్తు ఉంది. కాసేపటికి కళ్లు తెరచి వారి వంక చూసి మీరు కూడా నాలాగా చేయండి. దీని వలన మీకు వాక్సుద్ది అవుతుంది. మీ గొంతులు వీణల్లాగా మోగుతాయి అంటూంటే ఆ ఇద్దరు పిల్లలు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఇదంతా చూస్తున్న ఋఆజసేఖరు ఈ యోగా పిచ్చి బాగా ముదిరి పోయింది అని అనుకుంటూ తల పట్టుకున్నాడు. క్లాసు పూర్తయ్యి జ్యోత్స్న కూతురు ప్రణతికి అన్నము కలుపుకొనివచ్చి పెడ్తోంది. "మమ్మీ this is not good it tastes horrible" అని ప్రణతి జ్యోత్స్న పెట్టే అన్నం తినను అని మారాం చేయడం మొదలు పెట్టింది. " అయ్యో తినను అంటే ఎలా?" ఇది వాణి అంటి ఇచ్చిన ఉసిరికాయ పచ్చ్ది, నీకు చాలా మంచిది ఇంతలో రాజసేఖరు వచ్చి జ్యోత్స్నా ! ఇందులో కొద్దిగా బూజుకూడా పట్టినత్లుందే అది పిల్లకు పెట్టకు జబ్బు చేస్తుంది అని ఆ ఉసిరికాయ పచ్చడి డబ్బా తెచ్చిచూపించాడు. "అయ్యో మరేం ఫర్వాలేదండి, ఇది మన భారతదేశం నుంచి వచ్చిన పచ్చడి ఈ బూజు కూడా india బూజు. ఆవిడ చెప్పారండి దీనిలో ఎన్నో ఔషధగుణాలున్నాయో దీన్నే ఈ అమెరిక న్" స్ boos (goose)berry jam అని తింటూంటే మనమే అన్ని వదిలేస్తున్నాము అని అంటుంటే సరే నేను తినిపిస్తానులే అని ఆ అన్నము గార్బేజి లో పడేసి వేరే అన్నం కలిపి పెట్టాడు.

ప్రసూన గారింట్లో: "ఏమ్మా ప్రసూనా నీ యోగ క్లాసు అయ్యిందా" అని india నుంచి వచ్చినా వాళ్ళ అత్తగారు ఆమెని అడుగుటూంటే ప్రసూన యోగా వలన తను ఎలా weight ఎలా తగ్గింది ఇంకా ఏన్ని benefits ఉన్నాయో చెప్పడం మొదలు పెట్టింది. "అసలు
... to be continued

Comments

Popular posts from this blog

Cooking and Pretend Play with Cousins

గోపాలసామి