గురజాడ మహాకవి - Letter to Andhra Bhumi Editor

గురజాడగారు మహాకవి
- విరించిప్రియ
శ్రీ గురజాడగారు మహాకవి ఎలా అయ్యారు అని కదా ఈ చర్చ! కవి యొక్క గొప్పతనము ఆ కవి యొక్క రచనల మీద తప్ప ఆయన యొక్క స్వంత జీఇవితవిశేషాలమీద ఆధార పడి లేదని నా అభిప్రాయము. ఇక ఆ రచన గొప్పదా కాదా అన్నది ఆ రచనను మెచ్చిన చదువరులు, సమకాలీన కవుల అభిప్రాయాల మీద ఆధార పడి ఉంటుంది.
కన్యాశుల్కము నాటకము ఆయన సమకాలీన కవులలో చాలా మందికి నచ్చ్చకపోవడానికి కారణములను ఈ చర్చ మొదలు అయినదగ్గరనుంచి చదువుతూనే ఉన్నాము కదా! నేను ఇక్కడ ఎందుకు నచ్చలేదో అన్న దాని మీదకన్న , గురజాడగారు న భూతో న భవిష్యతి అన్నట్లుగా రచించిన కన్యాశుల్కము నాటకము ఆయనను మహాకవిగా ఎలా తీర్చిదిద్దింది అన్న దాని మీద నాకు అర్ధం అయిన రీతిలో మనవి చేద్దామని ప్రయత్నము.కన్యాశుల్కము నాటకము నేటికి ప్రజల నోట్లో నానుతుంది అంటే గురజాడ గారు ఎంతో ముందుచూపుతో ఎంచుకున్న ఇతివృత్తము, భాష, సాహితీ ప్రక్రియాలే కారణాలు.


ఏ భాషా సాహిత్యానికయినా ఒక ప్రయోజనము అనేది ఉంది. సామాజిక దురాచారలను, బలహీనతలను, మూఢనమ్మకాలను తమ పదునైన కలముతో ఎత్తి చూపడము అన్నది మహా కవులకు పరిపాటే. సామాజిక బాధ్యతకలిగిన ఒక మహాకవి కనుకే గురజాడగారు ఆనందగజపతిగారు తెప్పించిన, childmarriage statistics : relased by Vizainagam maharaja for the year 1892.

Total recorded marriages :344

99 girls at age 5

44 at age 4

36 at age 3

6 at age 2

3 at age<1

Further recorded that Rs 350-400 per child was paid as kanyasulkam. some occassions the marriage was fixed during the pregnancy.

The Purpose and the Audience are the essential elements for any writing అన్నది ఆ మహా కవి గుర్తించారు కాబట్టే కన్యాశుల్కము ఎవరికైతే చేరాలో వారికి చేరింది.
ఆయన audienceమధురవాణి, గిరీశం, బుచ్చమ్మ, మీనాక్షి లాంటి అభాగ్యులును, సమాజంలో కొద్దిమంది ప్రయోజనంఉ కోసము బలి అవుతున్న ముక్కుపచ్చలారని ఆడపిల్లల దౌర్భాగ్యపు తల్లులును. ఛంధోబధ్ధముగా, కఠినమైన సమాసములతో వ్రాసినట్లుగా అయితే ఏ కొంతమంది పండితుల చేతులలోనే ఈ మహా రచన ఉండి పోYఏదే తప్ప ఆయన ఎవరినైతే ఉద్దేశ్యించి వ్రాసారో వారికి అందేది కాదు.
దాశరథి కృష్ణమాచార్య్ల గారి అంతటి సంస్కృత పండితులు కూడా "చిల్లర దేవుళ్ళు ("తెలంగాణా భూస్వామ్య పద్ధతిని ఖండిస్తూ రచించిన నవలను) తెలంగాణా భాషలోనే ఎందుకు రచించారు ? మరి వీరందరూ మహా కవులు కారా ? ఇక మూడవది గురజాడగారు నాటకాన్నే ఈ రచనకు సరి అయిన సాహితీ ప్రక్రియ అని , తన సందేశమును ప్రజలోకి చేర్చకలదని చాల తెలివిగా ముందు చూపుతో ఆలోచించి చేసిన సాహస కృత్యము. ఆ కాలంలో ప్రజలు తీరిక సమయాలలో సేద తీర్చుకునే వ్యాపకాలలో ముఖ్యమైనవి బుఋఋఅకథలు, హరికథలు, నాటకాలు చూడడమే .నేడు సినిమాల ద్వార ఎలాగయితే మన రచయితలు, దర్శకులు మంచో, చెడో సందేశాల్ని పంపగలుగుతున్నారో ఆ రోజులలో నాటకాలు జనరంజకముగా ప్రదర్శింపబడేవి కనుక గురజాడగారు ఈ నాటకమునే కన్యాశుల్కమునకు ఎన్నుకోవడములో ఎంతో సమయస్ఫూర్తి కనబడుతుంది. ఆ బుఋఋఅ కథే సాధనముగా "పుత్తడి బొమ్మ పూర్ణమ్మ" అనే గేయాన్ని రాతికన్న కఠినమైన హృదయము కల ఎంతమంది అగ్నిహోత్రావధానుల నయినా గుండెలు కరిగించేలా రచించారు. అంతటి దుఃఖభరితమైన, భీభత్సమైన సామజిక దురాచారాన్ని హాస్యభరితమైన నాటకంగా రూపొందించిన కీర్తి ఒక్క గురజాడ మాహాకవికే దక్కింది.
హాస్యరసాన్ని ఎన్నుకోవడంలోని గురజాడగారి పరమార్థము ప్రజల చేత ఈ రచనను మరలమరల చదివించాలనే. ఈ నాటి వరకు కూడా కన్యాశుల్కము నాటక ప్రదర్శనైన, సినిమాయిన , పుస్తకమైన ఏ రూపములో వచ్చినా ఏ వయస్సు వారైన మరల మరల చూడాలి, చదవాలని అనుకుంటున్నారు అంటే అందులోని హాస్యం, దాని వెనకాల దాగి ఉన్న విషాదము రెండూ కారణం. ఏ భాషలోనైన ఒక కవి మహా కవి కావడానికి జనాదరణ ముఖ్యము. ఒక రచనకు జనాదరణ కలగాలంటే అ రచన యొక్క ఇతివృత్తము వారిని ఉద్దేశ్యించి ఉండటము, అందులోని సంఘటనలను తమకి ఆన్ వయించుకోవడానికి ఆస్కారము కల్పించుట చాలా ముఖ్యము. అదే రచన చిరకాలము నిలిచిపోవాలంటే ఇతివౄత్తముతోపాటు, శైలి, భాష, సాహితి ప్రక్రియా, అంతకు ముందెన్నడూ చేయని సాహసము కొంత విప్లావాత్మకత అవసరము అని కన్యాశుల్కము వక్కాణించి చెప్తోంది, అనడానికి నూరేళ్ళ తరువాత కూ డా మహాకవి గురజాడ గురించి జరుగుతున్న ఈ చర్చే నిదర్శనము. ఈ నాడు సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఎయిడ్స్, టెర్రరిసం, ఇంకా ఎన్నో సమాజాన్ని పెడత్రోవ పట్టిస్తున్న సమస్యలను వేలెత్తి చూపడానికి గురజాడ గారి లాంటి మహాకవులు లేకపోవడము మన దురదృష్టము.

Comments

Popular posts from this blog

Cooking and Pretend Play with Cousins

గోపాలసామి