"ఏమయ్యింది ? .....పాప ఎడ్చింది "


ఈ రోజు దాదాపు 10 సంవత్సరాల తరువాత మళ్లీ నా వ్రాత మొదలు పెట్టాలని పించింది , కారణం దైవికమే కావచ్చు.
ఇక నుంచి రోజు కనీసం ఒక పుట అన్నా దేని గురించిఅయిన వ్రాయాలని, అన్నట్టు దీ నికి మా అమ్మాయి  కొంత స్పందన ఇచ్చింది ఆఫీసు నుంచి రాగానే , భోజనం అయిన వెంటనే ఫోను చేశాను , అన్నట్టు  ఈ రోజు అసలు వాట్స్ అప్ లో చాట్ చెయ్యడానికి కుదరలేదు.
 అమ్మా , అమ్మా ఇండియన్ మదర్'స అనగా భారతీయ తల్లుల బ్లాగ్స్ లేవు , అదే ఇక్కడ అమేరికాన్స్ తల్లులు చిన్న పిల్లల పెంపకంలో  , రోజు ఎదురుకొనే చిన్న చిన్న ఇబ్బందులు వాట్కి చిట్కాలు , ఇంకా చాల ప్రయోజనకరమైన విషయాల గురించి బ్లాగ్స్ వ్రాస్తారు అన్నది.
నాకు కొద్దిగా ఆశ్చర్యమ వేసింది ఏమిటి  ఈ భారతీయ తల్లులంతా ఎం చేస్తున్నారు అని , బహుశ వారి వారి పిల్లలను డే కేర్ సెంటరులలో వదిలేసి ఉద్యోగ రంగములో తమ తమ రాణింపు గురించి బ్లాగ్స్ వ్రాస్తున్నారు కాబోలు .
నాకు woodwards gripe water ad గుర్తుకు వచ్చింది , "ఏమయ్యింది పాప ఎడ్చింది "
నేను ఆలోచించాను వెనకటికి పక్కింటి పిన్నిగారు కాని ఇంట్లో ఉన్న బామ్మగారు కాని,  సమయానికి వచ్చి కరక్కాయ రసం ఇవ్వు చప్పున జలుబు తగ్గుతుంది పాప కు అని సలహా ఇచ్చి వెళ్ళేవారు .
ఇప్పుడు అనుభవము ఉన్న పెద్దలు అందు బాటులో లేక పోవ టమో , లేక పెరటి  చెట్టు వైద్యముకి పనికిరాదనో ఇప్పుడ ఈ  మోడరన్ తల్లులు  ఎమర్జెన్సీ కి పరిగెత్తటమొ డాక్టరుకి ఫోన్ చెయ్యడమో లేక కంగారు పడి సర్వాంతర్యామి అయిన గూగుల్ దేవిని గాలించి , జలుబు దగ్గరనుంచి మహమ్మారి వరకు
అన్ని తమ పిల్లకే  ఉన్నాయని ఇంకా కంగారుపడి , లేని పోనీ పరిక్షలన్ని పిల్లలకు చేయించి, హైరానా పడు తున్నారు.
నూతన అనుభవము ఉన్న తల్లులు తము,  రోజు పిల్లల పెంపకము లో ఎదురుకునే సమస్యలు వాటి యొక్క నివారణ , తేలిక చిట్కాలు ఒక బ్లాగు తయారు చేసి పోస్ట్ చేస్తే , అదే సమస్యలు ఎదుర్కునే తల్లులకు చాల ఉపయోగమే కాకుండా అవసరమని అనిపించింది
ఆ పనిని మా అమ్మాయి హా రికనే చెయ్యమన్న ఎందు కంటే చాల రిసెర్చ్ చేసి మా మనవడిని   పెంచుతున్నది కాబట్టి


Popular posts from this blog

Cooking and Pretend Play with Cousins

Discovering the Beauty and Heritage of Hampi: A Personal Journey