"ఏమయ్యింది ? .....పాప ఎడ్చింది "
ఈ రోజు దాదాపు 10 సంవత్సరాల తరువాత మళ్లీ నా వ్రాత మొదలు పెట్టాలని పించింది , కారణం దైవికమే కావచ్చు. ఇక నుంచి రోజు కనీసం ఒక పుట అన్నా దేని గురించిఅయిన వ్రాయాలని, అన్నట్టు దీ నికి మా అమ్మాయి కొంత స్పందన ఇచ్చింది ఆఫీసు నుంచి రాగానే , భోజనం అయిన వెంటనే ఫోను చేశాను , అన్నట్టు ఈ రోజు అసలు వాట్స్ అప్ లో చాట్ చెయ్యడానికి కుదరలేదు. అమ్మా , అమ్మా ఇండియన్ మదర్'స అనగా భారతీయ తల్లుల బ్లాగ్స్ లేవు , అదే ఇక్కడ అమేరికాన్స్ తల్లులు చిన్న పిల్లల పెంపకంలో , రోజు ఎదురుకొనే చిన్న చిన్న ఇబ్బందులు వాట్కి చిట్కాలు , ఇంకా చాల ప్రయోజనకరమైన విషయాల గురించి బ్లాగ్స్ వ్రాస్తారు అన్నది. నాకు కొద్దిగా ఆశ్చర్యమ వేసింది ఏమిటి ఈ భారతీయ తల్లులంతా ఎం చేస్తున్నారు అని , బహుశ వారి వారి పిల్లలను డే కేర్ సెంటరులలో వదిలేసి ఉద్యోగ రంగములో తమ తమ రాణింపు గురించి బ్లాగ్స్ వ్రాస్తున్నారు కాబోలు . నాకు woodwards gripe water ad గుర్తుకు వచ్చింది , "ఏమయ్యింది పాప ఎడ్చింది " నేను ఆలోచించాను వెనకటికి పక్కింటి పిన్నిగారు కాని ఇంట్లో ఉన్న బామ్మగారు కాని, సమయానికి వచ్చి కరక్...