Posts

Showing posts from 2007

ఈ ప్రపంచానికి పేరేది

ఈ ప్రపంచానికి పేరేది - విరించిప్రియ ఈ రోజు ప్రొద్దున విజయ గారు phone చేశారు. " ఏమండోయ్ మీకో విషయం చెప్పనా ఈ అమెరికా జీవితం అంతా ఒక కల, ఎందుకంటే మనము వాస్తవానికి చాలా దూరంలో ఉంటున్నాము, India తిరిగి వెళితే అది అసలు Realty" అని అంటుంటే, నాకు ఆశ్చర్యమేసింది, ఎందుకంటే సరిగ్గా రెండు రోజులక్రితం నేను ఇదే మాట మా వారితో అలా అన్నాను. ఇది కొద్దిగా క్లిష్టమైన టాపిక్, ఎందుకంటే ఆ యొక్క భావాన్ని బాధని అర్ఢం చేసుకోవాలంటే మనము అందరము ఒక్క నిముషము మన ఈ fast forward , weekend to weekend ఎదురు చూసే జీవితన్ని pause నొక్కి మన చుట్టూ ఉన్నా పరిస్థితులకు మనము ఎల స్పందిస్తున్నము, అసలు ఆ పరిస్థితులు మన పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి అని చూసుకుంటే నేను, విజయా గారు చేసిన తీర్మానాన్ని మీరు ఆంగీకరిస్తారు.నేను back India లో ఎలా ఉండేదాన్ని ఇక్కడ ఎలా different గా ఉంటున్నానో చెప్పాలంటే మా చెల్లెలు indiaలో ఎలా ఉంటుందొ చూస్తే తెలుస్తుంది. నేను అమ్మా వాళ్ళకి phone చెయ్యటము మాట్లాడటము , ఏడాదికొకసారి India వెళ్లినప్పుడు చూసి రావటము మించి కూతురిగా నా బాధ్యతలు ఏమి లేవు అనుకుండేదాన్ని. ఇ నేను అలా అనడానికి అమ్మ...

గురజాడ మహాకవి - Letter to Andhra Bhumi Editor

గురజాడగారు మహాకవి - విరించిప్రియ శ్రీ గురజాడగారు మహాకవి ఎలా అయ్యారు అని కదా ఈ చర్చ! కవి యొక్క గొప్పతనము ఆ కవి యొక్క రచనల మీద తప్ప ఆయన యొక్క స్వంత జీఇవితవిశేషాలమీద ఆధార పడి లేదని నా అభిప్రాయము. ఇక ఆ రచన గొప్పదా కాదా అన్నది ఆ రచనను మెచ్చిన చదువరులు, సమకాలీన కవుల అభిప్రాయాల మీద ఆధార పడి ఉంటుంది. కన్యాశుల్కము నాటకము ఆయన సమకాలీన కవులలో చాలా మందికి నచ్చ్చకపోవడానికి కారణములను ఈ చర్చ మొదలు అయినదగ్గరనుంచి చదువుతూనే ఉన్నాము కదా! నేను ఇక్కడ ఎందుకు నచ్చలేదో అన్న దాని మీదకన్న , గురజాడగారు న భూతో న భవిష్యతి అన్నట్లుగా రచించిన కన్యాశుల్కము నాటకము ఆయనను మహాకవిగా ఎలా తీర్చిదిద్దింది అన్న దాని మీద నాకు అర్ధం అయిన రీతిలో మనవి చేద్దామని ప్రయత్నము.కన్యాశుల్కము నాటకము నేటికి ప్రజల నోట్లో నానుతుంది అంటే గురజాడ గారు ఎంతో ముందుచూపుతో ఎంచుకున్న ఇతివృత్తము, భాష, సాహితీ ప్రక్రియాలే కారణాలు. ఏ భాషా సాహిత్యానికయినా ఒక ప్రయోజనము అనేది ఉంది. సామాజిక దురాచారలను, బలహీనతలను, మూఢనమ్మకాలను తమ పదునైన కలముతో ఎత్తి చూపడము అన్నది మహా కవులకు పరిపాటే. సామాజిక బాధ్యతకలిగిన ఒక మహాకవి కనుకే గురజాడగారు ఆనందగజపతిగారు తెప్పించిన, ch...

రినైస్సాన్ యోగా క్లబ్

రినైస్సాన్ యోగా క్లబ్ మొదటి సీను వాణి: నా మాట మన్నించి మీరందరఊ ఈవేళ ఇక్కడకు వచ్చినందుకు చాలా సంతోషము. ఇప్పుడు అసలు విషయానికి వద్దాము. నేను ఈవేళ మిమ్మల్ని పిలిచింది మనం అందరము కలిసి "రినైస్సా న్ స్ యోగా క్లబ్" ఒకటి పెట్టి మనమే రోజు ఒక టైములో కలిసి యోగా ప్రాక్టీసు చెయ్యొచ్చు అన్న ఉద్దేశ్యముతో, దినికి మీ అందరి అభిప్రాయము కూడా తెలుసుకుందామని. ఈశ్వరి: ఓహ్! this is an excellent idea! నేను ఓహాయో లో ఉన్నప్పుడు యోగ క్లాసులకు వెళ్ళేదాన్ని. కావాలంటే I can guide you all . జాహిదా: అసలు యోగ క్లబ్ పెట్టాలన్న అధ్భుతమైన ఆలోచన మీకెలా వచ్చిందండి వాణీ గారు ? వాణి: మీరు చూస్తునే ఉన్నారు కదా మహిళా మండలులు మరీ 70'స్ ఫాషిఒన్ పాతవై పోయాయి, ఇక కిట్టీ పార్టీలు అవీ అంటే డబ్బుతో పని, బోలెడు శ్రమ. మనలో ఫిట్ నెస్సుకోసము ప్రతి ఒక్కరూ ఏదోక జిం లోనొ యోగాక్లాసు లోనో జాయినవుతున్నారు. సరే మనమే ఎందుకా పని చెయ్యకూడదని మిమంలని ఇక్కడ సమావెశ పరిచాను. జ్యోత్స్న: అవునవను, యోగ అయితే ఖర్చులేదు, శ్రమ అంతకంటే కాదు, ముక్కుమూసుకొని మున్నూటరవై రోజులు భేషుగ్గా చేసుకోవచ్చును. ఏమంటారండి ప్రసూన గారు! ప్రసూన: నాకయితే యోగ గురిం...

సౌందర్య

సౌందర్య - విరించిప్రియ రోజులాగా మా నాన్నగారు ఆఫీసు నుంచి రాగానే స్నానం చేసి దేవుడి గదిలోకి వెళ్ళి దణ్ణం పెట్టుకున్నారు. మేపిల్లలం ఏం మాట్లాడాలన్నా ఆఅయన మంచి మూడ్ కోసం ఎదురు చూస్తూంటాం. మా నాన్నగారి మూడ్ ఆరోజు బాగానే ఉందని ఆయన చిరునవ్వుతో మమ్మల్ని చూస్తూ పూజాగదిలోకి వెళ్ళినప్పుడే మా కర్థం అయి పోయింది. కానీ మాకు అర్థం కాని విషయం బాబా ఫోటోదగ్గర ఉన్న ఎన్ వలోప్ లో ఏముందో అని. మామూలుగాయితే నాన్నగారు జీతం డబ్బులు ఇంక్రిమెంట్లు బాబా ఫోటో దగ్గర పెడ్తూంటారు. కానీ అవి నెలాఖరు రోజులు కూడా కావు. ఆరోజు జూన్ 15 స్కూళ్ళు మొదలయ్యి రెండు రొజులే అయ్యింది. అది ఏమిటో దేవుడి గది దగ్గర వరుసగా నిలుచొని ఉన్న మా నలుగురికి ఒక పజిల్ లాగా ఉంది. మా అందరికి తెలుసు మా నాన్నగారు ఏ విషయమూ డైరెక్టుగా మా తో చర్చించరు. బహుశా 20 ఏళ్ళుగా ఆ పోలీసు ఉద్యోగంలో ఉండబట్టేనేమో ఆయన ఎప్పుడూ చాలా గంభీరంగా ఉంటారు. కొత్త వాళ్ళకయితే, మరీ ప లకరించాలంటేనే బెదురు పుడ్తుంది. కాని మేమంటే ఆయనకి చాలా ప్రేమ. ఇక భోజనాలకి కూర్చున్నాము. మా నాన్న గారు నన్ను పిలిచి ఆ కవరు తీసుకొచ్చి అందులో ఏముందో చదవమన్నారు.మా అన్నయ్యలిద్దరూ,మాచెల్లెలూ ఆ అవకాశము వాళ్...

గోపాలసామి

గోపాలసామి - విరించిప్రియ మేము హైదరాబాదు నుంచి బయలుదేరిన అయిదు గంటలకు కాని బాణాపురం చేరలేదు. మేము బాణాపురంలో బస్సు దిగేసరికి మధ్యాహ్నము పన్నెండయ్యింది. ఎండ మండి పోతుంది, బస్సులో జనం మధ్య ఉక్క పోసి వళ్ళంతా చెమటతో తడిసి పోయింది. కాని, బస్సు దిగిన తరువాత కచ్చడం బండిని, ప్రక్కనే మా కోసం నిల్చొని ఉన్న ఖాసింను చూసేసరికి నాకు, తమ్ముళ్ళిద్దరికీ ప్రాణం లేచి వచ్చింది. ప్రయాణం అలసట, వేడి, ఎండ, అన్ని ఎగిరిపోయాయి.అది మాకోసం మండవ నుంచి ఆమ్మ పంపించిందని వెంటనే మేము గుర్తు పట్టాము. ఇంతలో ఖాసిం మా దగ్గర నుంచి మా పెట్టెలందుకున్నాడు. నా చేతిలో బాగ్ తో నేను బండి ఎక్కాను. "బాగున్నావా ఖాసిం, దేవుడిపెళ్ళి పనులు ఎలా సాగుతున్నాయి" అని అడిగాను. "ఇంక మీరు వచ్చారు కదా అమ్మాయిగారు ఇక సందడే సందడి" అని తెగ సంబర పడిపోయాడు.ఖాసిం మా ఆమ్మ వాళ్ళ జీతగాడు, మా చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గరే జీతం చెస్తున్నాడు. ఆ బండికి కట్టి ఉన్న రెండు ఎడ్లని చూసి, "ఇవి సింగడు, రంగడు కదా, మరి గోపాలస్వామిని ఎందుకు తేలేదు" అని అడుగుతున్నాడు మా చిన్నతమ్ముడు. "గోపాలస్వామిని అరకకు కట్టారండి అబ్బాయి గారు," అ...
హిందూత్వము VirinchiPriya మత సామరస్యము, మత సహనము రెండూ మన భారతీయులలో ఎలా జీర్ణించుకొని పోయాయో వెనుకటి మన పల్లెలలో వారు నడిపిన, జీవన విధానాన్ని చూస్తే అర్ధం అవుతుంది. అది వారు ప్రత్యేకంగా పనికట్టుకొని ఇలా ఉండాలి అని అలవర్చుకున్నది కాదు. అది అనాదిగా భారతీయులలొ ప్రకృతి సిధ్ధంగా అలవడినది తప్ప మరొకటి కాదు. ఆ సహజీవనమే వారి నిజ జీవనవిధానము. ఆర్యుల నుంచి ఇటీవల కాలంలో వచ్చిన పాశ్చాత్యుల వరకు ఎంత మంది దండయాత్రలు సాగించినా, తమదైన పంథాలో తమ స్వంత ప్రవౄత్తిని కాపాడుకుంటూ అన్నిటినీ తమలో మమైకంచేసుకున్నారే తప్ప వేటిని వదిలేయలేదు.మనము ఈ సహనాన్ని, సామరస్యాన్ని రెండిటినీ కలిపి భారతీయతత్వము లేదా హిందూత్వము అని చెప్పుకోవచ్చును. హిందూత్వము యొక్క మౌలిక ప్రకౄతిలోనే మత సహనము ఇమిడియున్నది అనడానికి హిందూమతములో పుట్టి, ముకిత్ సాధనకు మతములు అడ్డు రావని నిరూపించిన ఒక ఇల్లాలే నా ఈ వ్యాసమునకు ప్రేరణ . అది కృష్ణా జిల్లాలో కంభంపాడు అన్న చిన్న గ్రామము. ఆవిడ ఎవరోకాదు మా తాతమ్మగారయిన భండారు రుక్కిణమ్మగారు. సనాతన సత్సంపన్న బ్రాహంఅణ వంశములో పుట్టి , అంతకు తగిన సదాచార్ బ్రాహంఅణ వంశమగు భండారు వారిల్లు మెట్టికూడా ఆమె తన పినతల్ల...